Saturday, November 27, 2010

పోమ్మనకుండా పొగపెట్టినట్టు

పొగ x అనుభవం అని టైటిల్ పెడదామనుకుని పోమ్మనకుండా పొగపెట్టినట్టు అని మార్చాను . 
మొదటిగా  సమయాభావం వల్ల నా బ్లాగును కొనసాగించలేక పోయినందుకు చింతిస్తూ ఇటీవలి నా అనుభవం నేడు(27-11- 2010 ) టీవీల ద్వారా ధూమపానం వల్ల జరుగుతున్న మరణాలు తెలుసుకొని పంచుకోదలచాను. ఈ ధూమపానం వల్ల వ్యసనపరులే కాక ఇతరుల మరణాలకు కూడా ఎలా కారణమవుతున్నారో తెలుసుకొని ఎంతో బాఢ పడ్డాను. బహుశా  ఈ విషయాన్ని గుర్తించేనేమో ప్రభుత్వం కూడా తమ కర్తవ్యంగా భావించి బహిరంగ ప్రదేశాలలో ప్రోగ  త్రాగారాదని నిషేధిస్తూ చట్టం కూడా చేసింది. కాని ఆచరణలో ఇది ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనందరికీ తెలిసిందే.
రెండు రోజుల క్రితం నేను విజయవాడలోని ఆటోనగర్ గేటు బస్టాప్ వద్ద నిలిచి వుండగా ఒక వ్యక్తి ధూమపానం వల్ల నా ముక్కుపుటాలు అదిరిపోయాయి. నాకు ఎంతో ఆక్రోశం కలిగి అతని చెంప పగులగోడదాం అనిపించింది. ఒకవేళ అతను తెలివిగా రెండో చెంప చూపిస్తాడేమో లేదా నా రెండు చెంపలు పగులకొడతాదేమో అని మౌనం వహించాను. దుష్టుడికి దూరంగా ఉండాలనే సామెత గుర్తుకు వచ్చి సహించాను.
 ఈ సందర్భంగా ఒక కవి వ్రాసిన సినిమా పాట గుర్తుకు వచ్చి దాన్ని ఈ విధంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు చేయవచ్చునేమో అనిపించింది. ఆ పాట -
"ఎన్ని చట్టాలు వచ్చినా చుట్టాలు చెప్పినా చేసేది ఏమిటో చేయరా బాబయా!"

నిజమే మరి చట్టాలు చేసినా కాని అవగాహన లేకనో లేక తమ ఇష్టాన్ని నెగ్గించుకునే పంతంతోనో ధూమపాన ప్రియులు తమకి, ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగించడం ఎంతో బాధాకరం. తమ వద్దనుండి  పొమ్మని పొగపెడితే అభ్యంతరం ఉండకపోవచ్చునేమో కాని ఆపోగే  లోకంలోనుంచి  పంపడానికైతే  సహించ గలమా!  తమకు దేశం ఏమి చేసిందో తాము దేశానికి కాక పోయినా  ఇతరుల కేమి ఏమి చేస్తున్నామో ఈ ప్రియులు గ్రహిస్తే ఎంత మేలు. ఇదే (ఇటీవలి కాలం నుండీ ఆరోగ్యం పట్ల శ్రద్దః వహించే) నా పొగ x(perience) అనుభవం. - మీ ప్రకాష్.

Wednesday, April 21, 2010

ఆవయవదానం X సమాధులు - కవ్వాలి కవిత

(గతంలో ఆవయవదానం X సమాధులు గూర్చిన రెండు తలంపుల మధ్య పుట్టుకువచ్చిన కవ్వాలి కవిత ఇది - ఇలాంటి కవ్వాలి కవితలుకూడా ఉన్నాయని ఇటివలే విన్నా - ఈచిరు ప్రయత్నం అంగీకరించి ఆస్వాదించగలరు - తగురీతి సూచించ గలరు)


దేహంతో దేవుణ్ణి ఘనపరచాలని మోక్షం చేరాలని
దైవభీతి పాపభీతి లేకుంటే మోక్షమే లేదుగా


బంధాలన్నీ తెంచుకున్న వారే నిజమైన సమాధి చేరినవారు
బంధాలు లేకున్నా ఆవయవదానంతో సమాధులుగా  మారిరివీరు

బ్రతికివుండగానే ఖర్చు చేస్తున్నారు  సమాధుల కోసం
బ్రతికివుండగానే ఖర్చై పోవాలనుకుంటున్నారు పరుల కోసం


తనవారినే శంకిస్తున్నారు బంధాలు తెంచుకుంటున్నారు
తనవారు కాకున్నా సాయపడి బంధాలు పెంచుకుంటున్నారు


ఎవరు చెప్పారో సమాధుల ద్వారా మోక్షం పొందగలమని
ఎవరూ చెప్పకున్నా ఎవరికైనా ఉపయోగపడాలనుకున్నారు


స్వంత సమాధి తోలుచుకోవటం ఈనాటిది కాదు ఏనాడో వచ్చింది
స్వంత ఆలోచన కాకున్నా ఈనాడు ఎవరూ అడ్డు చెప్పలేనిది


అది సంకుచితమైనదేమో ఆలోచించితివా
ఇది విశాలమైనదేమో యోచించితివా


స్వేచ్చా జీవి మానవా జీవితసారం ఎరుగవా
స్వేచ్ఛతోనే  నీలోని సంకల్పం సాధకమౌగా


మేలుకో మానవా అంతంలో కొంతైనా వదులుకోస్వార్ధం 
మసలుకో వికసిస్తూ తెలుసుకో కనీసం మతాలసారం

నీకు అభ్వంతరమేమీ లేదు సమాధి చేరాలనుకుంటే
నిన్ను అభ్వంతరపెట్టే దెవరు సమాధిగా మారాలనుకుంటే


స్వార్ధపరుడివైపోతున్నావేమో నిన్ను నీవే తెలుసుకో
నిస్వార్ధ పరుడవని నిన్ను గూర్చి ఇతరులే తేల్చాలి


అక్కడ దొరికేది  పూర్తిగా విశ్రాంతి గెలిచినా ఓడినా
ఇక్కడ ఉండేది అవిశ్రాంత పోరాటం గెలుపైనా ఓటమైనా


పోరాటం లేకుండా ఏ మానవుడైనా పొందగలడా మోక్షం
పిరికివారు మోక్షం చేరలేరని మతగ్రంధమిస్తుంది సాక్ష్యం 

                            * * * * *         
 

Tuesday, April 6, 2010

సమాధులు బతికుండగానే కట్టుకున్నారు

బ్రతికి ఉండగనే చేయించుకుంటిరి మీకోరకు సమాదులు
బ్రతికి ఉండగ తలిదండ్రుల సేవ జేసిన చరితార్డులు మీరు

పుట్టిననాడు మీకు జన్మమిచ్చినవారు సంతసించిరి 
పిదప యుక్త కాలమందు వివాహమహోత్సవంబు జరిపిరి 

జన్మించిన మీవారిని జూసి ఉప్పొంగితిరి జన్మమిచ్చినమిమ్ము మరతురని తెలియక
జన్మించిన వారందరూ అట్టివారనబోకు కొందరైనను గలరేమో మీవంటి వారు

మీతరమునకు మీరు మార్గమెదికితిరి ఆశలడియసలతో చూడగా నేటితరము
ఈనాటితరం గ్రహించాలి అంతరం! తుడిచివేయాలి!! కన్నవారి కన్నీటి వ్యధలు!!!  

ఈరోజు (ఏప్రిల్ 6, 2010) ఆంధ్ర జ్యోతి దినపత్రికలోని వార్త (వెలుగులోకి తెచ్చినందుకు  ప్రత్యేక కృతజ్ఞతలతో)  యధాతదంగా....  
ఇవి మా సమాధులే బతికుండగానే కట్టుకున్నాం వారసులు పట్టించుకోరన్న భయంతోనే!
మెదక్ జిల్లాలో వింత అలవాటు

మునిపల్లి, ఏప్రిల్ 5 (ఆన్‌లైన్): స్వార్థం రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో చనిపోయాక తమవాళ్లు తమకు సమాధులైనా కట్టిస్తారో లేదోనన్న అనుమానం, భయం వారిని వెన్నాడాయి. అందుకే.. బతికుండగానే తమకు కావల్సిన రీతిలో సమాధులు కట్టించుకుంటున్నారు. సమాధులూ ఆలయాలేనని వారి నమ్మి క. ఒకరు, ఇద్దరు కాదు.. మెదక్‌జిల్లా మునిపల్లి మండలంలో ఐదుగురు ఇలా బతికుండగానే సమాధులు కట్టించుకున్నారు. వీరిలో ముగ్గురు తమ సతీమణులకూ వాటిలో భాగం పంచి ఇ చ్చారు.

మునిపల్లి మండలం పెద్ద చెల్మడ గ్రా మానికి చెందిన గోవిందపురం పాపయ్య (90) ఐదేళ్ల క్రితమే సమాధి కట్టించుకున్నారు. పెద్దలోడికి చెందిన కప్పాటి బసప్ప (85) మూడేళ్ల క్రితం.. అదే గ్రామానికి చెందిన దేవగోని బసప్ప ఇటీవల సమాధులు నిర్మించుకున్నారు. సంగని బసప్ప నాలుగేళ్ల క్రితం కట్టించుకుంటే, మునిపల్లికి చెందిన ఆకుల చంద్రప్ప 30 ఏళ్ల క్రితమే తన సమాధి కట్టించుకున్నారు.

తండ్రి పాదరక్షలకూ పూజలు

ఐదేళ్ల క్రితం తన సమాధి కట్టించుకున్న గోవిందపురం పాపయ్య.. ప్రతిరోజూ అక్కడ పూజలు చేస్తారు. ఈయన తండ్రి సంగప్ప గతం లో కాశీ వెళ్తూ మార్గమధ్యంలో మహారాష్ట్రలో మరణించారు. ఆయన చివరిచూపు సైతం దక్కలేదని పాపయ్య బాధపడుతుంటారు. తన పరిస్థితి ఎలా ఉంటుందోనని.. ముందుగానే సమా ధి కట్టించుకుని, అక్కడ తన తండ్రి చివరి జ్ఞాపకంగా మిగిలిన ఆయన పాదరక్షలనూ పెట్టి పూజిస్తున్నారు. తాను మరణించిన తర్వాత తన తో పాటు తండ్రి పాదరక్షలు కూడా పెట్టి సమాధి చేయాలని కుటుంబసభ్యులకు చెప్పారు.

శివనామ స్మరణం

కప్పాటి బసప్ప మహా శివభక్తుడు. ఎప్పుడూ శివనామస్మరణమే చేస్తుంటారు. ఈయన మూడేళ్ల క్రితం రూ.55 వేలతో సమాధి కట్టించుకున్నారు. అందులో తన జీవిత సహచరికీ చోటిచ్చారు. శ్రీశైలంలో హోమం చేసి, అక్కడి నుంచి లింగం, బసవేశ్వర ప్రతిమలను తెచ్చి సమాధిపై ప్రతిష్ఠించారు. ముక్తి కోసం అనునిత్యం సమాధి లో ధ్యానంలో మునిగిపోతానని చెబుతున్నారు. ఇక దేవగోని బసప్ప ఇటీవలే తనకు నచ్చినట్లు రూ.50వేలతో సమాధిని నిర్మించుకున్నారు. ఈయన తండ్రి కూడా అంతే.
తమవారు కడతారో లేదో..
తమవారు సమాధిని నిర్మిస్తారో లేదో అనే అనుమానంతో ముందే తనకు నచ్చిన విధంగా నాలుగేళ్ల క్రితం సమాధిని నిర్మించుకున్నానని కమ్మంపల్లికి చెందిన సంగని బసప్ప అన్నారు. దానిపై తన చిత్రపటంతోపాటు శివలింగాన్ని ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు.

ఏం చేస్తారోనని..

కని పెంచినవారి ఆదరణ కోల్పోతున్న ఈ రోజులలో తా ను చనిపోయాక మృతదేహాన్ని మంచి ప్రదేశంలో పూడ్చిపెడతారో, లేదోనని ముందే సమాధిని నిర్మించుకున్నానని ము నిపల్లికి చెందిన ఆకుల చంద్రప్ప అన్నారు. ఈయన  30 ఏళ్ల క్రితమే తన కోసం సమాధి కట్టించుకున్నారు. అయిన వారు ఆదరించకున్నా గ్రామస్తులైనా ముందుకొచ్చి తాను నిర్మించుకున్న సమాధిలో పెడతారు కదా అని అంటాడు చంద్రప్ప.

Monday, April 5, 2010

ఆవయవదానం...

దాన మిచ్చిన నేమి అంతమందు అవయవంబులను
దానకర్ణుదంతటి వాణ్నిగాను బ్రతికియుండగ దానమీయ


అంతమందు నెవనికైన నే అవయంబైన నుపకరించినఎడ 
అంతకంటే మరి ధన్యతేది ఈ ధరణిలోన అంతమందు


మరుజన్మ ముందని భయపడిన - ఈ జన్మకేది చరితార్ధము
ఈ జన్మకు సృజియించె సృష్టికర్త - సమకూర్చునన్నీ మరుజన్మమున్నా


నశించు దాని దానమిచ్చిన నేడు సృష్టికర్తకు కూడ సహకారినౌదు
నశియించిన వేళ గురుతుచేయునది మరువక నాసృష్టికర్తకు కూడ

దానమిచ్చిన వానిజూచి సృష్టికర్త  పొగడువేళ
సిగ్గు  నొందెదరేమొ  దానమీయని  వారు


మట్టిలో కలిసేటి మట్టి దేహముపై మమకారమొదలుకుందు మరణమందు
సిగ్గునొంద నిపుడు దానమీయ-గర్వించుచుందు నపుడు నొకని కవయవంబై

ఆవయవదానం.. మరికొన్ని...
http://www.organtransplants.org/understanding/religion/
http://www.prajasakti.com/search/article-37976
http://www.prajasakti.com/search/article-87487

Monday, March 29, 2010

నీ కోసం నేను

నీ  కోసం నేను
నీ కోసం నేను
రాతి పై రాయి పేర్చి
కట్టా  నోగుడి 

(యాదృచ్చికం) 

పేర్చి కూర్చినా! 
నీవు నివసింపక 
కూలి పోయెనే!

కట్టా మరలా 
గుండెను గుడి చేసి 
నీవుంటా వని


నిన్ను చూసాక 
హృదయం ఉప్పొంగింది 
ప్రాణం లేచింది 

చేయా లిపుడు 
నూతన వాగ్దానం 
వీడనికని! 

* * *  

Friday, March 26, 2010

కంటితో చూపు - చూసేందుకే ఉందని

మొదటి చూపు   -   మైమరుపుతో చూసి   - మురిసిపోయా

రెండవ చూపు   -   చూడాలనే సాకుతో   -   ఆశగా చూసా

మూడవ చూపు   -   విసుగుతో చూసి   -   వేసారిపోయా

మరొక చూపు   -   చూడకూడదికని   -   చూడక చూసా

ప్రతి చూపులో   -   కనిపించిందిపుడు   -   కన్నీటి వ్యధ

కంటితో చూపు   -   చూసేందుకే ఉందని   -   చూస్తుండి పోయా

చూసే కొలదీ   -   వ్యధ గాంచే కొలదీ   -   చలించి పోయా

కంటి వెనుక   -   కడలి దాగుందని   -   కరిగి పోయా 

ఆ చూపులోనే   -   పొందుకొవాలి నిత్యం   -   నూతనత్వం

కారాదిపుడు   -   కంటి చూపెన్నడునూ   -   విషపు చూపు

చివరి చూపు   -   అది కావాలి మళ్లీ   -   మొదటి చూపు

* * * * * 
 

Thursday, March 25, 2010

ఏటి గట్టున 
నీటి పాయలలోన 
నీ ప్రతిబింబం
-------
మరపు రాదు 
మరచి పోదామన్నా 
 నీ సౌందర్యం 
-------
పాయలో దిగా 
నీ దరి చేరాలని
మునిగిపోయా
-------
ఆదుకున్నావు
దిగివచ్చిన నీవు
దిగ్గున నన్ను
-------
గట్టున నీవు
నీటి పాయలో నేను
ఏమి నాభాగ్యం
-------
అంతా నిర్మలం
ఏటి అలలే లేవు
అద్దరి చేరా
-------
చేరిన నన్ను
నిర్మల మనసుతో
చేర దీశావు
-------
ఏమి ఈ చిత్రం!
ప్రకృతిలో సౌందర్యం
అంతా విచిత్రం!!
(యాదృచ్చికం)  

Wednesday, March 24, 2010

కానుసన్యాల్ ఆత్మహత్య

కానుసన్యాల్ ఆత్మహత్య (పతికల్లో చూసా) -  ఒక విప్లవ సిద్దాంతానికి భాగస్వామి.  ఆ పిలుపు  అందుకున్న  వారు  పెడత్రోవ   పట్టారని  విమర్శించి  బాధపడిన   వాడు. అమరులైన భగత్ సింగ్ వర్ధంతి రోజే (23.3.10) అనారోగ్యంతో ఉరివేసుకొని చనిపోయడంటే జాలి పడాలో బాధ పడాలో  తెలియని  స్థితి.  ఇది సిద్ధాంత రూపకర్తలకు  ఎలాంటి సందేశం ఇస్తుందో కానీ,  తాను కూడా కేవలం  మనిషే అని  హింసామార్గం  చివరకు తనకేమి మిగల్చలేదని తేలిపోయింది.  హింసే మార్గం,  దౌర్జన్యమే  బలం  అనుకునే  వారికి ఇది గుణపాఠం కాగలదేమో  వేచి చూద్దాం.  ఆత్మహత్య  మహాపాతకం అంటారే అలాగే ఆత్మహత్యలు  చేసుకున్న  వారిని  అమరులని  కూడా అంటున్నారు.   ఆ కుటుంబాల వ్యధలు  తీర్చే  వారెవ్వరూ  లేకపోతినా  తీరకపోయినా (ఆవేశంలో ఆత్మహత్యలకు  పాల్పడే వారిని ఆపేదెవరు - నీవు నేనేగా). ఈయనకు  ఎలాంటి  కీర్తిని  ఆపాదిస్తారో  అదికూడా  చూడాల్సిందే.   ఈసందర్భంగా   కొన్ని మాటలు  (సరిగ్గా అతకక పోయినా) భావం గ్రహిస్తారని --- 
ఆశ్చర్య పోయా  -  అంతమై పోయాడని  -  కానుసన్యాల్
తెలియగానే       -  అది ఆత్మహత్యని     -  విస్తుపోయాను 

బాధ పడ్డాను    -  అమరులయ్యారని    -  భగత్ సింగులు

గమ్యం ఒకటే     -  మనిషి మనుగడే      -  వారు కోరేది 
అంతం మాత్రం   -  ఇస్తుందొక సందేశం  -  నేర్చుకోమని 
భగత్ సింగులు  -  ఆశ్రయించెను కదా   -  ఉరి కంబాన్ని   

కానుసన్యాల్     -  వేసుకొనెను గదా     -  స్వంతంగా ఉరి

ఎంతటి తేడా      -  మనిషిగా పుట్టినా    -  ఎందుకీ అంతం

అది  సిద్ధాంతం   -  ఒకరికి పునాది        -  కాని మరేది

తీరని బాధ        -  మరొకరికి ఉంది        -  తీర్చలేనిది  

మానవ జన్మ    -  ముగిసి పోవాల్సిందే  -  అర్దాంతరంగా 

కాదు కారాదు   -  ముగిసి పోవాల్సిందే  -  అర్ధవంతంగా   
                             * * * * *

Tuesday, March 23, 2010

కఠిన శిక్ష - శ్రీరామ రక్ష

స్త్రీమూర్తి కిక
కారాదు జీవితం  
కఠిన శిక్ష
--------------
గూడు కట్టిన
మనసులో గాయలు
మాని పోవాలి
-------------------
పోగొట్టుకున్న
ప్రేమానురాగాలన్నీ       
పొందుకోవాలి
-------------------
నిందలు పడి
వేసుకోరాదెన్నడు      
మరణ శిక్ష 
----------------
దిక్కెవరిక!
కుటుంబాభివృద్ధికి
మహిళ గాక!!
--------------------
మరణ మున్నా!
మానవ జన్మలకు
మీరేగా భిక్ష!!
-------------------
వంశాభి వృద్ధి  
తనలో నింపుకున్న 
సహన మూర్తి! 
--------------------
చల్లని చూపే 
మహిళ లందరికి 
కావాలి రక్ష! 
-----------------
పడకూడదు!
ఏ నరవానరుని 
విషపు చూపు!!
----------------------
మోసగాళ్ళకు
తప్పకుండా పడాలి  
కఠిన శిక్ష 
-------------
జీవిత సారం 
సత్యాన్వేషకులకు 
శ్రీరామ రక్ష  
----------------

శ్రీరామ నవమి పండుగ జరుపుకుంటున్న సోదర సోదరీమణులందరికి శుభాకాంక్షలు    

Sunday, March 21, 2010

అర్జంటుగా 'ఆంధ్రా' పేరు మార్చాలి!

అర్జంటుగా 'ఆంధ్రా' పేరు మార్చాలి!


ఈ టైటిల్ చూసి ఖంగు తిన్నారా.  ఖంగారు పడకండి.  ఇటీవల రాష్ట్రంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  హింసలు, దౌర్జన్యాలు, బలాత్కారాలు,  నైతికవిలువల పతనం.. ఓహ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.  అన్నిప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కంటే ఇందులో మనమే ముందున్నామేమో అనిపిస్తుంది. పైకి చెప్పుకో గలిగేవారు కొందరైతే, చెప్పుకోలేక అన్నీ దిగమింగుకునే  వారు మరికొందరు.  ఒకసారి నాలో నాకే  ఆలోచన వచ్చి నేనెవరినని  ప్రశ్నించుకున్నా.  ఇంతలో ఒక పెద్దాయన యాదృచ్చికంగా 'ఆంధ్రా' అంటే అర్ధం తెలుసా అని నన్నడిగి - పైకి క్రిందికి చూస్తున్న నన్ను గమనించి తనే చెప్పు కొచ్చాడు...


ఆంధ్ర అంటే ఆర్య + ద్రావిడ అనే రెండు మాటల్లోని మొదటి అక్షరాల కలయిక (ఆ + ద్ర = ఆంధ్రా లేక ఆంధ్ర).

అందుకే ఈ రాష్ట్రంలో పూర్వ కాలంలో నివసించే వార్ని ఆంధ్రులు అంటారు.  అలా ఆ పదం వాడుక లోకి వచ్చింది.


చరిత్ర నాకంతగా తెలియకపోయినా ఇదేదో బాగానే ఉన్నట్లు.. అలాగా... అన్నట్లు చూసాను..


ఎందుకు ఆంధ్రులు అని పిలవాల్సి వచ్చిందో తెలుసా అని అడిగారాయన (తెలియనివి ఎవో చెబుతున్నట్లు అనిపించి నాకు తెలియకుండానే గౌరవభావం పుట్టినట్లనిపించింది). తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాను.  ఏమనుకున్నాడో  ఏమో ఆయనగారు ప్రారంభించారు....


ఆంధ్ర అనే  పదానికి చాలా చరిత్ర ఉంది కాని స్వంత సంస్కృతి లేదు. నీకు తెలుసుగా ఉత్తర భారత దేశంలో ఉండే వారిని ఆర్యులు దక్షిణాన ఉండేవారని ద్రవిడులు అంటారని.  ఇదికూడా తెలిసుండాలే ఇద్దరికి పడదని ఎప్పుడూ యుద్దాలు జరిగేవని.  చివరికి  రాజి కొచ్చార్లే అని కొంచం విసురుగా చెబుతుంటే అర్ధం కానట్లు చూస్తూ ఉండిపోయా.


మళ్లీ ఆయనే...


అసలు వాళ్ళ సంస్కృతి వేరు వీళ్ళది వేరు. వాళ్ళ దేవుళ్ళు వేరు వీళ్ళ దేవుళ్ళు వేరు.  ఎప్పుడూ జరిగే యుద్దాలు, నష్టాలు చూసి కొందరు  ఇదిగో మీ  దేవుళ్ళ వాహనాలే మా దేవుళ్ళ దేవతల వాహనాలు అలాగే మీవి కూడా.  దేవుళ్ళందరూ  ఒకటే అందరం కలిసి పూజలు చేద్దాం సంబరాలు జరుపుకుందాం.   సాంస్కృతిక మార్పిడులు చేసుకుందాం .  స్వంత పురాణాలు వ్రాసుకుందాం పరస్పరం గౌరవించుకుందాం.  మీ పిల్లలను మా కివ్వండి మా పిల్లలని మీ కిస్తాం మనమందరం ఒకటే అంటూ రాజి కుదుర్చుకున్నారు (ఇదేదో ఈమధ్య వినిపిస్తున్న పెద్దమనుషుల ఒప్పందంలా ఉందే అనిపించింది అయినా అంతా ఒప్పుకొని ఉంటారా అని  అనుమానం కూడా వచ్చింది).


నామనసులో మాట గ్రహించాడేమో.. వెంటనే...


ఐనా అందరూ  ఒప్పుకోలేదులే... నిజాయితీగా ఉండేవారు ఉంటారుగా అంటూ అప్పుడు నాలుగు వర్ణాలు ఉండేవి తెలుసా? అన్నారు.  (ఏమీ తెలియనట్లే బిక్క మొహం వేసాను).


గమనించాడేమో.. ఆయనే మరలా...


బ్రాహ్మణులు, క్షత్రియులు,  వైశ్యులు ఇంకా శూద్రులు  అనే ఈ నాలుగు వర్ణాలలో చాలామంది ఆ కలయికకు ఒప్పుకున్నా కొందరు ఒప్పుకోలేదు (ఇలాంటిదేదో మరో వర్ణం ఉండాలే అనుకుంటుండగానే). ఇలా ఒప్పుకున్నవారు  ఒప్పుకోనివార్ని వెలి వేసి పంచములు అని పేరు పెట్టారు.  అలాంటిపేరే అప్పటికి ఎవరికీ తెలియదు మనుగడలోకి రాలేదు.  మనుసంస్కృతిలో  కూడా  అది లేదు (ఇది విని నిశ్చేష్టుడినైపోయాను).


ఆయనే మళ్లీ...


అందుకే మన రాష్ట్రము లో అప్పుడు 'వెలి' వేసిన వారినే రకరకాల కులాలుగా పేర్లు పెట్టి పంచములన్నారు.  ఐదవ వర్ణం  "పంచములు" మనుగడలోకి వచ్చింది అప్పుడే.  చూసావా అప్పటి  ఆర్యుల ద్రావిడుల అపవిత్ర  కలయిక ఎన్ని చిక్కులు తెచ్చి పెట్టిందో (అదే స్పూర్తితో ఎన్నికలప్పుడు ఇలాంటి 'అపవిత్ర' కలయిక అనే  పదాలు వాడుతున్నారేమో అనిపించింది) అందుకే  ఎప్పుడూ ఈ గొడవలు. కలవకుండా ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా అప్పుడే విడిగా ఉంటే  పోయేది. కష్టమో నష్టమో ఒక దేశంగా కలిసిపోయం.  భరత ఖండంగా పిలువబడుతున్నాం. రెంటికి మధ్యలో మనం బలైపోయం.  అంటూ ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.


మళ్లీ నేనాలోచనలో పడిపోయా.. పెద్దాయన చెప్పిందాంట్లో ఎంతవరకు వాస్తవముందో  తెలియలేదు గాని ఇప్పుడు జరిగే  గొడవలు గాని విలువల పతనం గాని క్రొత్తగా పుట్టినవి కావు.  వారసత్వ సంపదగా అశాంతిలో కొనసాగుతున్నవేనేమో అనిపించింది.   లేకపోతే ఎక్కడా ఎలాంటి సర్దుబాటు లేకుండా ఇన్ని విభేదాలు, కులాలు, రాజీ పడలేని మనస్తత్వాలు  ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎందుకుండాలి.   భిన్నత్వంలో ఏకత్వంగా భారత దేశం మనగలిగినప్పుడు.  ఆస్పూర్తి లేకున్నా కలిసుండి విడిపోవాలా  విడిపోయి  కలవాలా  ఏదీ అర్దంకాని స్థితి  ఆంధ్ర పరిస్థితి.  ఏదిఏమైనా కలిసిఉన్నా విడిపోయినా అందరి క్షేమమే కదా అందరికి కావాలి.  మానవ విలువలు  మాత్రం  ఇక  ఎంతమాత్రం  దిగజరకూదదు.   ఇది మనుషులకు సంబంచిందింది కాదు మనసుతో పెనవేసుకున్నది.  నేటితరం కులమత ప్రాంతాల కతీతంగా ఖండాంతరాలలో కీర్తిని వ్యాపింప చేయసంకల్పించింది.  భవిష్యత్ తరానికి ఎలాంటి సందేశం అందబోతుందో.  ఏ ప్రాంతంలోనయినా  మనవారి  విలువలు మరింతగా  దిగజారకుండా,  అభద్రతా భావం లేకుండా ఎవరైనా  ఏదైనా  సంకల్పిస్తే ఎంతమేలు అనుకుని కళ్ళుతెరిచా.  

ఇంతకీ పెద్దాయన అన్నట్లు - పూర్వం 'ఆంధ్రా'  పేరు అపవిత్ర కలయికగా చెప్పుకుని పుట్టినదేనా? 

ఒకప్పటి అంద్రులై ఇప్పుడుకూడా అంద్రులుగా పిలువబడుతున్న  ఆంధ్ర ప్రదేశ్ నివాసులైన మనకు  స్వంతంగా ఎలాంటి వారసత్వ సంస్కృతి  లేదా?  సంస్కృతే లేని వారికి కలిసుంటేనేమి  ఎన్ని   రాష్ట్రాలుగా నైనా విడిపోతేనేమి?  ఏవరికి బాధ?  

అలాగయితే  ఇప్పుడు 'ఆంధ్రా' పేరు అర్జంటుగా మార్చాల్సిందేనా?  ప్రశ్నగానే మిగిలిపోయింది.

నీ నోటి మాట

నీ నోటి మాట!

(యాదృచ్చికం)

నీ నోటి మాట 
పచ్చని పచ్చికపై 
వాన చినుకు 

నీ నోటి మాట
జుంటి తేనె కంటెనూ  
ఎంతో మధరం

నీ నోటి మాట 
నా మూగ మనసుకు 
ఎంతో ఊరట


నీ నోటి మాట
నా బాధలలో ఎంతో
ఓదార్పు నిచ్చు

నీ నోటి మాట
గాయం చేసినా నన్ను
మంచిగా మార్చు

నీ మాటలలో
నా హృదయ స్పందన
ప్రతిధ్వనించు


నీ మాటలలో
కానరాదు ఎన్నడు
ఏ పక్షపాతం

నీ నోటి మాట
ఎన్నడూ మారనిది
మార్పులేనిది

నీ నోటి మాట 
నిత్య కావాలి నాకు
వీనుల విందు  

* * *

Thursday, March 18, 2010

పువ్వును నేను!

పువ్వును నేను!
  పువ్వును నేను!  

(అన్నీ యాదృచ్చికం)

పువ్వును నేను!
మనసుకు ఆహ్లాదం
కలిగిస్తాను!


పువ్వును నేను!
రాతి గుండెను కూడా 
మార్చ గలను!

  

 పువ్వును నేను! 
ప్రేమకు గురుతుగా 
మారగలను! 


పూజకు మాత్రం 
పనికి రాను. అంటే..
వా...డి పో....తాను!


పువ్వును కదా!
రాలినా..నలిగినా...
మాయమైపోతా!!

* * *

Tuesday, March 16, 2010

నీ ఊసు తెలియక!!

నీ ఊసు తెలియక!!

నీ ఊసు తెలియక!! 


(యాదృచ్చికం - గూగుల్ వారి సౌజన్యంతో)  

వెదుకుతున్నా!
నీ ఊసు తెలియక!!
నిరంతరం!

ఎదురుచూసా!
నీ ఊసు తెలియక!!
నీ రాక కోసం!

నీ వాంఛ తోనే! 
ఉదయించింది నాలో 
శాశ్వత ప్రేమ! 

ఉండిపోయావు!
నా కనుసన్నలలో!!
కంటి పాపవై!!!

* * *
 


Monday, March 15, 2010

నరుడు వికృతంగా మారితే

ఇది ఉగాది! తెలుగు సంవత్సరాది!! వికృతినామ వత్సరమిది!!!
అందరికి శుభాలు తేవాలిది!!!!


మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మృగం లా మారి
మనిషి పొందుకుంటున్నదేదో అర్ధం కాదాయె సాటి మనిషికి!
మనిషిలోని పై ఆకర్షణకు  ప్రేమను జోడించి వంచింతు రేల
మనిషిలో కామ వాంఛకన్న మృగమే మిన్న యని చాటి  చెప్పుటకా!!

ఏమాయను ఆనాటి మన విలువలు  గతించిపోయె  నని భాష్యం పలుకుదుమా
ఎవరివలన  దాపురించినదీ దుర్గతియని ప్రశ్నించరేల నెవనినైనా  నెవ్వరైననూ
ఎవరు ఈ మాయలాడి సాధుసన్యాసులు! కామికాక మోక్షగామి గారనువారలా!! 
వీరికి బుద్ది జెప్పు వారెవ్వరు లేరందుమా! లేక దైవమే లేడని అందుమా!!

ఉన్నాడని  నమ్మినా దైవం, ప్రేమలేని వాడ నైతే వ్యర్దుడనే
ఉన్నదని ఆకర్షణ లోనే  ప్రేమ, అంటే అది కూడా వ్యర్ధమే
ఉందనుకుని ప్రేమ, ఏళ్ళ తరబడి వెదికి నిరాశ చెందనేల?
ఉంటె ఆకర్షణలో ప్రేమ, కాగలవా కుటుంబాలు విశ్చిన్నం?

తప్పదు ఒకనాడు మనిషి చేసిన క్రియలకు ఫలితం
తప్పదు  మంచివైనచొ నవి  మంచి ప్రతిఫలం
తప్పదు  చెడ్డవైనచొ నవి శిక్షార్హమైన ప్రతిఫలం
తప్పించుకోలేడు ఏ నరుడైనను పొందకుండా తగిన ఫలం!

అందుకే దైవ భక్తి సాధనతో నిజ ప్రేమను వెదికి కొంతైన చెడుని విసర్జించ గలరేమో
అందుకొరకు వెదకాలేమో ప్రతిమనిషిలోనూ ప్రేమనూ మంచినీ కోరే దైవత్వం

దైవత్వం గాంచక పోతే నసింప జేయగలరా నెవరైన నెవరిలోనైన రాక్షసత్వం
దైవత్వం రాక్షసత్వం రెండూ గుర్తెరిగి మేల్కొల్పాలి మనిషిలో మానవత్వం

 (ఈ చాయ చిత్రం నేను తీసింది కాదు - మొదటి ప్రయత్నంగా వాడటం జరిగింది) 

పారద్రోలాలి మనిషిలోని దుర్గుణం
పొందుకొవాలి నూతనంగా సద్గుణం

మనిషిగా పుట్టిన మనందరి కొరకే శ్రేయస్కర సమాజం
మనిషిలోనే సాధ్యమయ్యే ఈ మార్పు ఆహ్వానిద్దాం అందరం

ఇది అసాద్యమయినచో! తప్పదిక మానవజాతి వినాశనం!!
ఈ వికృతినామ సంవత్సర ప్రాశస్త్యం ఏమిటో గ్రహిస్తూనే ఉందాం!!  

                      * * * * * * *

Sunday, March 14, 2010

నేస్తం-ఓదార్పు-చిన్నడౌటు

నా  నేస్తానికి 
ఏ భాషా తెలియదు
భావము తప్ప!

ఆకలి  గొంటే
అన్నంతో తీరుస్తుంది (తీరుస్తాడు)
ఓదార్పు నిస్తూ!

దప్పిక గొంటే
దాహంతో తీరుస్తుంది  (తీరుస్తాడు)
ఓదార్పు నిస్తూ!

మౌనం వహిస్తే
మనసుతో చూస్తుంది (చూస్తాడు)
ఓదార్పు నిస్తూ! 
 
స్వస్థత పోతే
సపర్యలు చేస్తుంది (చేస్తాడు
ఓదార్పు నిస్తూ!
 
సంతోషం వస్తే  
తనూ సంతోషిస్తుంది (స్తాడు
మనస్పూర్తిగా!
 
నా నెచ్చలికి
ఉండాలని ఉంటుంది (భాషే కాదు ఉండే చోటేదో తెలియదు)
నిత్యం నాతోనే!

అందుకే మరి
ఇచ్చా నా హృదయంలో   (ఏ ప్రాంతమో తెలియకున్నా)
చిన్నటి చోటు!
 
(ఇంత వరకు బాగానే వున్నా.. ఉండాలనే అందరం కోరేది... కానీ....)   
 
ఆఖరి డౌటు..
చివరకు వెళ్ళేది...
వంటరి గానే....

(ఎవరికైన తప్పనిది చివరకు శారీరక మరణమే కదా...
అందుకే ఎలాగైనా అంతా నిలిచి వుందాం! అమరంగా!!)   

Saturday, March 6, 2010

మనిషి! మానవత్వం!!

ఎందరినో గాయపరచి మరచితిని మానవత్వం అపుడు
ఎందరి చేతనో గాయపరచబడి మానవత వైపు మరలితి నిపుడు 
ఎంత వెదికినా దొరకదేమి ఏ మనిషిలోనూ ఈ  మానవత్వం 
ఎందు వెదికినా ఎలా దొరకును జారవిడుస్తూ నేనది నిత్యం    

చేసితి నెన్నో చేయరానివి మోసితి నెన్నో మోయలేనివి ఒకనాడు
చేసితినవి మంచినీ మానవతనూ సంపూర్తిగా మరచి ఆనాడు
చేసేది లేక వగచి వగచి చివరకు చేరితి నొకని చెంత మరునాడు
చేసింది తరచి తరచి జూసి మనిషినా నేనని సిగ్గుతో తలవంచితి నేడు!

ఇది నా హృదయ స్థితి! ఒక  సామాన్య మానవుని పరిస్థితి!!
ఇది తెలియక చెంత చేరిన వాని ఆర్తితో అడిగితి ఈ చింత ఏమని?
ఇంతలో చెప్పాడాయన నీవు కేవలం మనిషివని! లోకం అంతే నని!!
ఇది నా లోకమా! మంచిని మరపించునదా!! మానవత నుండి విడిపించునదా!!!

అంత సులువైనది కాదా ఈ మానవత! మహాత్ములు దాగున్న ఇచ్చోట!!
అందరూ అన్నా అసాధ్యంబని! చేయాలి కదా కొందరైన  అది సుసాధ్యంబు!!
అందుకే పుట్టితినేమో ఇచట సాటి మనిషిగా! మరువకుండ నాలో మానవత!!
అందుకైననూ ఆశ్రయిస్తా ఆరాద్యుని!  తిరిగి నాలో నింపు కొనుటకు మానవత్వం!! 

రాక్షసి కాను
అందుకే పుట్టానేమో
నే మనిషిగా!

మనగలనా!
మానవత కొరకు
మంచి కొరకు

హింసను వీడే  
అహింసను చేపట్టే  
మార్గం వెదికా! 

ఎంత వరకు
దీపం ఆరే వరకు
అంతం వరకు!

Thursday, March 4, 2010

నా నోరు! నా ఇష్టం!!

పైకి మృదువు  
నోట వచ్చు మాటలు
లోన మోసం

పైకి కఠినం
మనసులో కారుణ్యం
ఆ నోటి మాట

ఏమిటీ తేడా
రెండూ నోటి మాటలే! 
ఎంతటి తేడా!!

గాయం చేస్తుంది
తెలుసుకునే లోపే
మొదటి మాట

గాయం చేసినా
కోరేది నిజ స్నేహం
రెండవ మాట


గాయం చేసేవి
గమ్యాన్ని మార్చేవి 

నోటి మాటలే!

మొదట వెన్న
రెండవది  పై పూత

కానరానిది!

పూత  లేకున్నా 
చల్లని నోటి మాట
ఇచ్చు ఓదార్పు!

రెంటికి మూలం
కట్టడి లేని నాలుక
ఉంటా! జాగ్రత్త!!
 

Wednesday, March 3, 2010

నిజమైన సామాన్యులు

ఓరిమిలేక
సామాన్యుల నెల్లను
త్రోసివేసిన


చెప్పజాలని
మాటలన్నియు జెప్పి
మనగలర?


ఎంత చెప్పిన
విన నొల్లక పోగ   
వగచనేల


ఓరిమి గల
సామాన్యులు వీరెగ
విడువనేల 


కసిరినేమి  
బదులు చెప్పలేరు 
ఒరిమితోడ 


వారినెరిగి 
మసలుకున్న యెడ 
విడువలేరు  


కోర్కె లెరిగి 
పైకేమి చెప్పలేరు
ఆదుకోమని 


ఆదు కున్నను
అడియాసలు లేని 
శాంత మూర్తులు


అట్టి వారిని 
కనిపెట్ట వలదె
నిజముగను!  


  

ఎవ్వరది!!

ఆకలి గొని
ఆర్తితో ఎదురేగి
స్వాగతిస్తుంది

అంతలో వెళ్లి
కొంతలో కొంతైనను
విడువనంది

చివరికేమి
ఆశలు లేకున్నను
వదలనంది

వద్దువద్దని  
నీకొరకే నేనని
ఇకపోనని

నచ్చితివని  
మరల ఆశ రేపె
మరెవ్వరది

భాష కందదు
భావమే తెలియదు 
ఇంకెవ్వరది

వీడనంటుంది
సరిలేరు నీకంటూ
వేరెవ్వరది

నన్ను ప్రేమించి 
నా కొరకు తపించె
వారెవ్వరది

తెలిసినెడ
నీవె నాకు దిక్కందు
లేరెవ్వరని!!      

Sunday, February 28, 2010

తెలుగులో హైకులు తప్పేమీ కాదే!

నేర్పిన నెవరైన నేర్చుకుందు మాతృభాషను గూర్చి
కూర్చిన నేమి ఐదేడైదక్షరాల హైకు  శ్రేష్ట  భావంబు జేర్చి
నేర్పితిరా నెవనికైన సీస ప్రాస పద్య గద్యంబుల గూర్చి 
కూర్చిన వాని గేలి  సేయనేల హైకని కైపని భావంబు గూర్చి

మాతృభాష యన్న మమకార మెవరికి లేదన్న 
పిత్రుపారంపర్య మన్న సంస్కర మిదన్న
సత్యమెన్నడు మరుగు సేయబడదు గదన్న
నిత్యము జనులు ఆశింపకున్న! ఎందులో ఉన్నా!

భాష కున్నదేమో హద్దు భావానికిది అంటగట్ట వద్దు
భాష తోనైనా గ్రహింపకున్న పొదిక పొద్దు
భాష లందు తెలుగు తీపి యన్నది మరువ వద్దు
భాష నాతెలుగు భాష! అది హైకన్నా కైపన్నా నాకు ముద్దే!!

హద్దు లెందుకు
కూర్చబడిన భావం
సరి చూడగ

గ్రహింపకున్న
భాషకు లేదికర్ధం
చేయకనర్ధం 

సరిగ చేసి  
భాషపై ప్రేమనుంచి   
ప్రేమను పెంచు

గ్రహింప రేల
భావంలోనైనా హైకు
పండితవర్యా!  

 

Saturday, February 27, 2010

కష్టమైనా ఇష్టమైన ఐదేడైదక్షరాల హైకులు!

ఇష్టమైనది
అభ్యాసము లేకున్నచో 
లేదిక  హైకు!
నిజమైనదే
చాణక్యుడు చెప్పింది
కష్టమే హైకు!
వదలకేచ్చ 
నేర్చుకుంటూ విజ్ఞత 
ఇచ్చలో హైకు!  
ఆశలు లేవు
నిరాశలు వీడవు
ఆశలో హైకు!
చెంతచేరినా
వంచనకు గురైనా  
ముంచినా హైకు!
జీవిత యాత్ర
ఆగదు మనకోసం
సాగితే హైకు!
మేలులు చేసి
కీడులను సహించి 
జీవించు హైకు!
చిత్రమైనది
అంతు చిక్కనిది  
కాదులే హైకు!
విలువైనది
కానీ కొనలేనిది
వెలతో హైకు!
ఇలలో అంతా
నీది నాదే అయితే
అందరి హైకు!
భ్రాంతులు మాని 
చేసేద నీకొరకు  
యజ్ఞంలో హైకు!
అందుకే ఇష్టం
అభ్యాసము చేయడం 
పొందుకో హైకు!

ఇష్టమైన్దిస్తూ
నచ్చింది ఆస్వాదిస్తూ
వచ్చింది  హైకు!
ఇందుకే చేసా  
నిరంతరాస్వాదంలో
యత్నం హైకు!
కష్టంతో నైనా
ఇష్టంతో పొందుకుంటా 
అశ్వాద హైకు!!    

Tuesday, February 23, 2010

హృదయం మోసకరమైనది

హృదయం మోసకరమైనది

అన్నిటి కంటే
మోసకర మైనది
హృదయమట!

ఎందుకన్నారో 
ఆలోచనల మూలం
అదే అంటారు

మభ్య పెట్టును
మాయలో పడేయును
మార్గం మూయును

ఆశ చూపుతూ
అందలము ఎక్కిస్తూ
క్రిందికి తోస్తూ

దురాశలతో
మోసంలో పడవేస్తూ
ఏడ్పు పుట్టిస్తూ

నీవెవరంటూ 
నన్నెక్కిరిస్తూ నాకే
ఎదురౌతుంది

ఏమి చెప్పను
ఎలా శాంత పడను
ఈ అశాంతిలో

వెదికా దారి
ఆ దారెటు పోయేదో 
తెలియకనే 

ఆశ్రయించగా
నాకొక కాంతిపుంజం  
ఉదయించింది

అన్నీ మరచి
ముందుకు సాగిపోవు 
హైకే పుట్టింది!!
 

చీకటివెలుగులు సృష్టికిమూలం - తొమ్మిది హైకులు

చీకటివెలుగులు సృష్టికిమూలం - తొమ్మిది హైకులు  

సృష్టికి మూలం
వెలుగే నంటే తంటా  
మరి చీకటి!

చీకటి మూలం
తెలియక పోతే   
మరింత తంటా!!

ఎందుకో ఇంత 
పెంచుకుంటూ పోతా..
చెప్పరాదిక!

చెప్పే దొకటే
వినగల వోర్పుంటే 
రేయీ పగలు   

చీకటి కాంతి
కలయిక లేనిది 
గ్రహించే దెలా!   

ఒకే వెలుగు. 
గాయత్రిలో చెప్పిందే..
గ్రహిస్తే మేలే... 

వెలుగై ఉంది! 
మరుగు చేయనిది!! 
నేర్పితే హైకే!!! 

గ్రహిస్తారంతా  
వెలుగుసంబంధులు 
వోర్పుతో హైకు! 

చీకట్లో కాంతి
గ్రహిస్తా వెలుగుతో
భళిరే హైకు!!

Sunday, February 21, 2010

మరపురాని బాధా....

మరిస్తే  పోలా!
మధురమిక  ఎలా!!
వారేవా హైకు!!!
చేయిపట్టుమనేవారెవ్వరో! 

నా చేయిపట్టు
నాతో నడువు అని
అనేదెవ్వరు?
చాణిక్యుడి దృష్టిలో ఆలోచన అంటే...

కష్టమైనది
తరువాత  ఇంతేనా  
అనిపించేది  
యదార్ధవాది - లోకవిరోధి

యదార్ధవాది
లోక విరోధనగ 
మరో హైకట

Saturday, February 20, 2010

కోపిస్టితో సహవాసం - చెరుపు చేయనీకుమా! 

కోపచిత్తుని
సహవాసం చేసిన
మాన్పునా గాయం...    
జ్ఞానం గల స్త్రీ పురుషులు ఎందరో!

జ్ఞానం కలిగి
ఇల్లు కట్టు కొనును
అజ్ఞాని కూల్చు
స్నేహానికి మూలం?

హృదయశుద్ధి 
దయగల మాటలు 
జతకు నాంది  
జ్ఞానలేమి! 

లేదు జ్ఞానము
కాదు కదా అజ్ఞానం
ఇదే నా హైకు 

Wednesday, February 17, 2010

జ్ఞానము లేక నశించమా?

అంకుశం తోనే
ఏనుగు అదుపులో
మరి జ్ఞానంతో....