Monday, March 15, 2010

నరుడు వికృతంగా మారితే

ఇది ఉగాది! తెలుగు సంవత్సరాది!! వికృతినామ వత్సరమిది!!!
అందరికి శుభాలు తేవాలిది!!!!


మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మృగం లా మారి
మనిషి పొందుకుంటున్నదేదో అర్ధం కాదాయె సాటి మనిషికి!
మనిషిలోని పై ఆకర్షణకు  ప్రేమను జోడించి వంచింతు రేల
మనిషిలో కామ వాంఛకన్న మృగమే మిన్న యని చాటి  చెప్పుటకా!!

ఏమాయను ఆనాటి మన విలువలు  గతించిపోయె  నని భాష్యం పలుకుదుమా
ఎవరివలన  దాపురించినదీ దుర్గతియని ప్రశ్నించరేల నెవనినైనా  నెవ్వరైననూ
ఎవరు ఈ మాయలాడి సాధుసన్యాసులు! కామికాక మోక్షగామి గారనువారలా!! 
వీరికి బుద్ది జెప్పు వారెవ్వరు లేరందుమా! లేక దైవమే లేడని అందుమా!!

ఉన్నాడని  నమ్మినా దైవం, ప్రేమలేని వాడ నైతే వ్యర్దుడనే
ఉన్నదని ఆకర్షణ లోనే  ప్రేమ, అంటే అది కూడా వ్యర్ధమే
ఉందనుకుని ప్రేమ, ఏళ్ళ తరబడి వెదికి నిరాశ చెందనేల?
ఉంటె ఆకర్షణలో ప్రేమ, కాగలవా కుటుంబాలు విశ్చిన్నం?

తప్పదు ఒకనాడు మనిషి చేసిన క్రియలకు ఫలితం
తప్పదు  మంచివైనచొ నవి  మంచి ప్రతిఫలం
తప్పదు  చెడ్డవైనచొ నవి శిక్షార్హమైన ప్రతిఫలం
తప్పించుకోలేడు ఏ నరుడైనను పొందకుండా తగిన ఫలం!

అందుకే దైవ భక్తి సాధనతో నిజ ప్రేమను వెదికి కొంతైన చెడుని విసర్జించ గలరేమో
అందుకొరకు వెదకాలేమో ప్రతిమనిషిలోనూ ప్రేమనూ మంచినీ కోరే దైవత్వం

దైవత్వం గాంచక పోతే నసింప జేయగలరా నెవరైన నెవరిలోనైన రాక్షసత్వం
దైవత్వం రాక్షసత్వం రెండూ గుర్తెరిగి మేల్కొల్పాలి మనిషిలో మానవత్వం

 (ఈ చాయ చిత్రం నేను తీసింది కాదు - మొదటి ప్రయత్నంగా వాడటం జరిగింది) 

పారద్రోలాలి మనిషిలోని దుర్గుణం
పొందుకొవాలి నూతనంగా సద్గుణం

మనిషిగా పుట్టిన మనందరి కొరకే శ్రేయస్కర సమాజం
మనిషిలోనే సాధ్యమయ్యే ఈ మార్పు ఆహ్వానిద్దాం అందరం

ఇది అసాద్యమయినచో! తప్పదిక మానవజాతి వినాశనం!!
ఈ వికృతినామ సంవత్సర ప్రాశస్త్యం ఏమిటో గ్రహిస్తూనే ఉందాం!!  

                      * * * * * * *

7 comments:

Padmarpita said...

ఎంతబాగా చెప్పారండి....
మీకు ఉగాది శుభాకాంక్షలు!

Anil Dasari said...

Looks like a picture from the Redwood Forest north of SFO.

చిలమకూరు విజయమోహన్ said...

మీకు వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

కెక్యూబ్ వర్మ said...

బాగా చెప్పారు. ఉగాది శుభాకాంక్షలు..

http://saamaanyudu.wordpress.com/2010/03/15/%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%AE%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B8%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%89%E0%B0%97/#comments

శివ చెరువు said...

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు.. - శివ చెరువు

suryaprakash said...

'Padmarpita' గారికి అబ్రకదబ్ర, చిలమకూరు విజయమోహన్, కెక్యూబ్, శివ చెరువు గార్లకు ఇంకా నన్ను ప్రోత్సహిస్తున్న ankush, అక్షరమొహం గార్లుకు, కూడలి వారికీ, ఈ సౌకర్యం ఉచితంగా కల్పించిన గూగుల్ వారికీ, ఈబ్లాగ్ వీక్షితున్న వారికీ, స్పందన తెలియ జేసినా లేక తెలియ జేయక లేక పొయినా అందరికీ నా ప్రత్యక కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మీ శ్రేయస్సు ఆశించే మీ శ్రేయోభిలాషి లా కొనసాగుతా - సూర్యప్రకాష్.

Ankush said...

peru saardhakam chesukuntunnaru....kavitvala dwara gnana prkasaanni andistunnaru....Daanni paiki pettandi ('keep it up' in teluguloki literal ga anuvadincha..antey..ha ha ha).

Post a Comment