Sunday, March 21, 2010

అర్జంటుగా 'ఆంధ్రా' పేరు మార్చాలి!

అర్జంటుగా 'ఆంధ్రా' పేరు మార్చాలి!


ఈ టైటిల్ చూసి ఖంగు తిన్నారా.  ఖంగారు పడకండి.  ఇటీవల రాష్ట్రంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  హింసలు, దౌర్జన్యాలు, బలాత్కారాలు,  నైతికవిలువల పతనం.. ఓహ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.  అన్నిప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కంటే ఇందులో మనమే ముందున్నామేమో అనిపిస్తుంది. పైకి చెప్పుకో గలిగేవారు కొందరైతే, చెప్పుకోలేక అన్నీ దిగమింగుకునే  వారు మరికొందరు.  ఒకసారి నాలో నాకే  ఆలోచన వచ్చి నేనెవరినని  ప్రశ్నించుకున్నా.  ఇంతలో ఒక పెద్దాయన యాదృచ్చికంగా 'ఆంధ్రా' అంటే అర్ధం తెలుసా అని నన్నడిగి - పైకి క్రిందికి చూస్తున్న నన్ను గమనించి తనే చెప్పు కొచ్చాడు...


ఆంధ్ర అంటే ఆర్య + ద్రావిడ అనే రెండు మాటల్లోని మొదటి అక్షరాల కలయిక (ఆ + ద్ర = ఆంధ్రా లేక ఆంధ్ర).

అందుకే ఈ రాష్ట్రంలో పూర్వ కాలంలో నివసించే వార్ని ఆంధ్రులు అంటారు.  అలా ఆ పదం వాడుక లోకి వచ్చింది.


చరిత్ర నాకంతగా తెలియకపోయినా ఇదేదో బాగానే ఉన్నట్లు.. అలాగా... అన్నట్లు చూసాను..


ఎందుకు ఆంధ్రులు అని పిలవాల్సి వచ్చిందో తెలుసా అని అడిగారాయన (తెలియనివి ఎవో చెబుతున్నట్లు అనిపించి నాకు తెలియకుండానే గౌరవభావం పుట్టినట్లనిపించింది). తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాను.  ఏమనుకున్నాడో  ఏమో ఆయనగారు ప్రారంభించారు....


ఆంధ్ర అనే  పదానికి చాలా చరిత్ర ఉంది కాని స్వంత సంస్కృతి లేదు. నీకు తెలుసుగా ఉత్తర భారత దేశంలో ఉండే వారిని ఆర్యులు దక్షిణాన ఉండేవారని ద్రవిడులు అంటారని.  ఇదికూడా తెలిసుండాలే ఇద్దరికి పడదని ఎప్పుడూ యుద్దాలు జరిగేవని.  చివరికి  రాజి కొచ్చార్లే అని కొంచం విసురుగా చెబుతుంటే అర్ధం కానట్లు చూస్తూ ఉండిపోయా.


మళ్లీ ఆయనే...


అసలు వాళ్ళ సంస్కృతి వేరు వీళ్ళది వేరు. వాళ్ళ దేవుళ్ళు వేరు వీళ్ళ దేవుళ్ళు వేరు.  ఎప్పుడూ జరిగే యుద్దాలు, నష్టాలు చూసి కొందరు  ఇదిగో మీ  దేవుళ్ళ వాహనాలే మా దేవుళ్ళ దేవతల వాహనాలు అలాగే మీవి కూడా.  దేవుళ్ళందరూ  ఒకటే అందరం కలిసి పూజలు చేద్దాం సంబరాలు జరుపుకుందాం.   సాంస్కృతిక మార్పిడులు చేసుకుందాం .  స్వంత పురాణాలు వ్రాసుకుందాం పరస్పరం గౌరవించుకుందాం.  మీ పిల్లలను మా కివ్వండి మా పిల్లలని మీ కిస్తాం మనమందరం ఒకటే అంటూ రాజి కుదుర్చుకున్నారు (ఇదేదో ఈమధ్య వినిపిస్తున్న పెద్దమనుషుల ఒప్పందంలా ఉందే అనిపించింది అయినా అంతా ఒప్పుకొని ఉంటారా అని  అనుమానం కూడా వచ్చింది).


నామనసులో మాట గ్రహించాడేమో.. వెంటనే...


ఐనా అందరూ  ఒప్పుకోలేదులే... నిజాయితీగా ఉండేవారు ఉంటారుగా అంటూ అప్పుడు నాలుగు వర్ణాలు ఉండేవి తెలుసా? అన్నారు.  (ఏమీ తెలియనట్లే బిక్క మొహం వేసాను).


గమనించాడేమో.. ఆయనే మరలా...


బ్రాహ్మణులు, క్షత్రియులు,  వైశ్యులు ఇంకా శూద్రులు  అనే ఈ నాలుగు వర్ణాలలో చాలామంది ఆ కలయికకు ఒప్పుకున్నా కొందరు ఒప్పుకోలేదు (ఇలాంటిదేదో మరో వర్ణం ఉండాలే అనుకుంటుండగానే). ఇలా ఒప్పుకున్నవారు  ఒప్పుకోనివార్ని వెలి వేసి పంచములు అని పేరు పెట్టారు.  అలాంటిపేరే అప్పటికి ఎవరికీ తెలియదు మనుగడలోకి రాలేదు.  మనుసంస్కృతిలో  కూడా  అది లేదు (ఇది విని నిశ్చేష్టుడినైపోయాను).


ఆయనే మళ్లీ...


అందుకే మన రాష్ట్రము లో అప్పుడు 'వెలి' వేసిన వారినే రకరకాల కులాలుగా పేర్లు పెట్టి పంచములన్నారు.  ఐదవ వర్ణం  "పంచములు" మనుగడలోకి వచ్చింది అప్పుడే.  చూసావా అప్పటి  ఆర్యుల ద్రావిడుల అపవిత్ర  కలయిక ఎన్ని చిక్కులు తెచ్చి పెట్టిందో (అదే స్పూర్తితో ఎన్నికలప్పుడు ఇలాంటి 'అపవిత్ర' కలయిక అనే  పదాలు వాడుతున్నారేమో అనిపించింది) అందుకే  ఎప్పుడూ ఈ గొడవలు. కలవకుండా ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా అప్పుడే విడిగా ఉంటే  పోయేది. కష్టమో నష్టమో ఒక దేశంగా కలిసిపోయం.  భరత ఖండంగా పిలువబడుతున్నాం. రెంటికి మధ్యలో మనం బలైపోయం.  అంటూ ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.


మళ్లీ నేనాలోచనలో పడిపోయా.. పెద్దాయన చెప్పిందాంట్లో ఎంతవరకు వాస్తవముందో  తెలియలేదు గాని ఇప్పుడు జరిగే  గొడవలు గాని విలువల పతనం గాని క్రొత్తగా పుట్టినవి కావు.  వారసత్వ సంపదగా అశాంతిలో కొనసాగుతున్నవేనేమో అనిపించింది.   లేకపోతే ఎక్కడా ఎలాంటి సర్దుబాటు లేకుండా ఇన్ని విభేదాలు, కులాలు, రాజీ పడలేని మనస్తత్వాలు  ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎందుకుండాలి.   భిన్నత్వంలో ఏకత్వంగా భారత దేశం మనగలిగినప్పుడు.  ఆస్పూర్తి లేకున్నా కలిసుండి విడిపోవాలా  విడిపోయి  కలవాలా  ఏదీ అర్దంకాని స్థితి  ఆంధ్ర పరిస్థితి.  ఏదిఏమైనా కలిసిఉన్నా విడిపోయినా అందరి క్షేమమే కదా అందరికి కావాలి.  మానవ విలువలు  మాత్రం  ఇక  ఎంతమాత్రం  దిగజరకూదదు.   ఇది మనుషులకు సంబంచిందింది కాదు మనసుతో పెనవేసుకున్నది.  నేటితరం కులమత ప్రాంతాల కతీతంగా ఖండాంతరాలలో కీర్తిని వ్యాపింప చేయసంకల్పించింది.  భవిష్యత్ తరానికి ఎలాంటి సందేశం అందబోతుందో.  ఏ ప్రాంతంలోనయినా  మనవారి  విలువలు మరింతగా  దిగజారకుండా,  అభద్రతా భావం లేకుండా ఎవరైనా  ఏదైనా  సంకల్పిస్తే ఎంతమేలు అనుకుని కళ్ళుతెరిచా.  

ఇంతకీ పెద్దాయన అన్నట్లు - పూర్వం 'ఆంధ్రా'  పేరు అపవిత్ర కలయికగా చెప్పుకుని పుట్టినదేనా? 

ఒకప్పటి అంద్రులై ఇప్పుడుకూడా అంద్రులుగా పిలువబడుతున్న  ఆంధ్ర ప్రదేశ్ నివాసులైన మనకు  స్వంతంగా ఎలాంటి వారసత్వ సంస్కృతి  లేదా?  సంస్కృతే లేని వారికి కలిసుంటేనేమి  ఎన్ని   రాష్ట్రాలుగా నైనా విడిపోతేనేమి?  ఏవరికి బాధ?  

అలాగయితే  ఇప్పుడు 'ఆంధ్రా' పేరు అర్జంటుగా మార్చాల్సిందేనా?  ప్రశ్నగానే మిగిలిపోయింది.

4 comments:

Ankush said...

ilaga kooda aalochincha vachchaa? ane aalochana kaligindi?jawaabu naaku teliyadam ledu, prasna gaane migilipoyindi?yevaraina pariskharam chestaremo, chooddaam.........

Malakpet Rowdy said...

LOL, this is hilarious!

suryaprakash said...

స్వేచ్చగా మీ అభిప్రాయం వ్యక్తపరచినందుకు ధన్యవాదాలు. మీరు సార్ధకనామదేయులుగా మిగిలిపొకూడదనె ఆశిస్తున్నా.

ఆ.సౌమ్య said...

భలే రాసారండీ....మీ ఆలోచనకి జోహార్లు...మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
మీరడిగిన సందేహానికి జవాబు దొరికితే నాక్కూడా చెప్పండేం?

Post a Comment