Saturday, March 6, 2010

మనిషి! మానవత్వం!!

ఎందరినో గాయపరచి మరచితిని మానవత్వం అపుడు
ఎందరి చేతనో గాయపరచబడి మానవత వైపు మరలితి నిపుడు 
ఎంత వెదికినా దొరకదేమి ఏ మనిషిలోనూ ఈ  మానవత్వం 
ఎందు వెదికినా ఎలా దొరకును జారవిడుస్తూ నేనది నిత్యం    

చేసితి నెన్నో చేయరానివి మోసితి నెన్నో మోయలేనివి ఒకనాడు
చేసితినవి మంచినీ మానవతనూ సంపూర్తిగా మరచి ఆనాడు
చేసేది లేక వగచి వగచి చివరకు చేరితి నొకని చెంత మరునాడు
చేసింది తరచి తరచి జూసి మనిషినా నేనని సిగ్గుతో తలవంచితి నేడు!

ఇది నా హృదయ స్థితి! ఒక  సామాన్య మానవుని పరిస్థితి!!
ఇది తెలియక చెంత చేరిన వాని ఆర్తితో అడిగితి ఈ చింత ఏమని?
ఇంతలో చెప్పాడాయన నీవు కేవలం మనిషివని! లోకం అంతే నని!!
ఇది నా లోకమా! మంచిని మరపించునదా!! మానవత నుండి విడిపించునదా!!!

అంత సులువైనది కాదా ఈ మానవత! మహాత్ములు దాగున్న ఇచ్చోట!!
అందరూ అన్నా అసాధ్యంబని! చేయాలి కదా కొందరైన  అది సుసాధ్యంబు!!
అందుకే పుట్టితినేమో ఇచట సాటి మనిషిగా! మరువకుండ నాలో మానవత!!
అందుకైననూ ఆశ్రయిస్తా ఆరాద్యుని!  తిరిగి నాలో నింపు కొనుటకు మానవత్వం!! 

రాక్షసి కాను
అందుకే పుట్టానేమో
నే మనిషిగా!

మనగలనా!
మానవత కొరకు
మంచి కొరకు

హింసను వీడే  
అహింసను చేపట్టే  
మార్గం వెదికా! 

ఎంత వరకు
దీపం ఆరే వరకు
అంతం వరకు!

1 comment:

అక్షర మోహనం said...

meaningful poems. keep continue sir.

Post a Comment