Sunday, February 28, 2010

తెలుగులో హైకులు తప్పేమీ కాదే!

నేర్పిన నెవరైన నేర్చుకుందు మాతృభాషను గూర్చి
కూర్చిన నేమి ఐదేడైదక్షరాల హైకు  శ్రేష్ట  భావంబు జేర్చి
నేర్పితిరా నెవనికైన సీస ప్రాస పద్య గద్యంబుల గూర్చి 
కూర్చిన వాని గేలి  సేయనేల హైకని కైపని భావంబు గూర్చి

మాతృభాష యన్న మమకార మెవరికి లేదన్న 
పిత్రుపారంపర్య మన్న సంస్కర మిదన్న
సత్యమెన్నడు మరుగు సేయబడదు గదన్న
నిత్యము జనులు ఆశింపకున్న! ఎందులో ఉన్నా!

భాష కున్నదేమో హద్దు భావానికిది అంటగట్ట వద్దు
భాష తోనైనా గ్రహింపకున్న పొదిక పొద్దు
భాష లందు తెలుగు తీపి యన్నది మరువ వద్దు
భాష నాతెలుగు భాష! అది హైకన్నా కైపన్నా నాకు ముద్దే!!

హద్దు లెందుకు
కూర్చబడిన భావం
సరి చూడగ

గ్రహింపకున్న
భాషకు లేదికర్ధం
చేయకనర్ధం 

సరిగ చేసి  
భాషపై ప్రేమనుంచి   
ప్రేమను పెంచు

గ్రహింప రేల
భావంలోనైనా హైకు
పండితవర్యా!  

 

Saturday, February 27, 2010

కష్టమైనా ఇష్టమైన ఐదేడైదక్షరాల హైకులు!

ఇష్టమైనది
అభ్యాసము లేకున్నచో 
లేదిక  హైకు!
నిజమైనదే
చాణక్యుడు చెప్పింది
కష్టమే హైకు!
వదలకేచ్చ 
నేర్చుకుంటూ విజ్ఞత 
ఇచ్చలో హైకు!  
ఆశలు లేవు
నిరాశలు వీడవు
ఆశలో హైకు!
చెంతచేరినా
వంచనకు గురైనా  
ముంచినా హైకు!
జీవిత యాత్ర
ఆగదు మనకోసం
సాగితే హైకు!
మేలులు చేసి
కీడులను సహించి 
జీవించు హైకు!
చిత్రమైనది
అంతు చిక్కనిది  
కాదులే హైకు!
విలువైనది
కానీ కొనలేనిది
వెలతో హైకు!
ఇలలో అంతా
నీది నాదే అయితే
అందరి హైకు!
భ్రాంతులు మాని 
చేసేద నీకొరకు  
యజ్ఞంలో హైకు!
అందుకే ఇష్టం
అభ్యాసము చేయడం 
పొందుకో హైకు!

ఇష్టమైన్దిస్తూ
నచ్చింది ఆస్వాదిస్తూ
వచ్చింది  హైకు!
ఇందుకే చేసా  
నిరంతరాస్వాదంలో
యత్నం హైకు!
కష్టంతో నైనా
ఇష్టంతో పొందుకుంటా 
అశ్వాద హైకు!!    

Tuesday, February 23, 2010

హృదయం మోసకరమైనది

హృదయం మోసకరమైనది

అన్నిటి కంటే
మోసకర మైనది
హృదయమట!

ఎందుకన్నారో 
ఆలోచనల మూలం
అదే అంటారు

మభ్య పెట్టును
మాయలో పడేయును
మార్గం మూయును

ఆశ చూపుతూ
అందలము ఎక్కిస్తూ
క్రిందికి తోస్తూ

దురాశలతో
మోసంలో పడవేస్తూ
ఏడ్పు పుట్టిస్తూ

నీవెవరంటూ 
నన్నెక్కిరిస్తూ నాకే
ఎదురౌతుంది

ఏమి చెప్పను
ఎలా శాంత పడను
ఈ అశాంతిలో

వెదికా దారి
ఆ దారెటు పోయేదో 
తెలియకనే 

ఆశ్రయించగా
నాకొక కాంతిపుంజం  
ఉదయించింది

అన్నీ మరచి
ముందుకు సాగిపోవు 
హైకే పుట్టింది!!
 

చీకటివెలుగులు సృష్టికిమూలం - తొమ్మిది హైకులు

చీకటివెలుగులు సృష్టికిమూలం - తొమ్మిది హైకులు  

సృష్టికి మూలం
వెలుగే నంటే తంటా  
మరి చీకటి!

చీకటి మూలం
తెలియక పోతే   
మరింత తంటా!!

ఎందుకో ఇంత 
పెంచుకుంటూ పోతా..
చెప్పరాదిక!

చెప్పే దొకటే
వినగల వోర్పుంటే 
రేయీ పగలు   

చీకటి కాంతి
కలయిక లేనిది 
గ్రహించే దెలా!   

ఒకే వెలుగు. 
గాయత్రిలో చెప్పిందే..
గ్రహిస్తే మేలే... 

వెలుగై ఉంది! 
మరుగు చేయనిది!! 
నేర్పితే హైకే!!! 

గ్రహిస్తారంతా  
వెలుగుసంబంధులు 
వోర్పుతో హైకు! 

చీకట్లో కాంతి
గ్రహిస్తా వెలుగుతో
భళిరే హైకు!!

Sunday, February 21, 2010

మరపురాని బాధా....

మరిస్తే  పోలా!
మధురమిక  ఎలా!!
వారేవా హైకు!!!
చేయిపట్టుమనేవారెవ్వరో! 

నా చేయిపట్టు
నాతో నడువు అని
అనేదెవ్వరు?
చాణిక్యుడి దృష్టిలో ఆలోచన అంటే...

కష్టమైనది
తరువాత  ఇంతేనా  
అనిపించేది  
యదార్ధవాది - లోకవిరోధి

యదార్ధవాది
లోక విరోధనగ 
మరో హైకట

Saturday, February 20, 2010

కోపిస్టితో సహవాసం - చెరుపు చేయనీకుమా! 

కోపచిత్తుని
సహవాసం చేసిన
మాన్పునా గాయం...    
జ్ఞానం గల స్త్రీ పురుషులు ఎందరో!

జ్ఞానం కలిగి
ఇల్లు కట్టు కొనును
అజ్ఞాని కూల్చు
స్నేహానికి మూలం?

హృదయశుద్ధి 
దయగల మాటలు 
జతకు నాంది  
జ్ఞానలేమి! 

లేదు జ్ఞానము
కాదు కదా అజ్ఞానం
ఇదే నా హైకు 

Wednesday, February 17, 2010

జ్ఞానము లేక నశించమా?

అంకుశం తోనే
ఏనుగు అదుపులో
మరి జ్ఞానంతో....