Sunday, March 21, 2010

నీ నోటి మాట

నీ నోటి మాట!

(యాదృచ్చికం)

నీ నోటి మాట 
పచ్చని పచ్చికపై 
వాన చినుకు 

నీ నోటి మాట
జుంటి తేనె కంటెనూ  
ఎంతో మధరం

నీ నోటి మాట 
నా మూగ మనసుకు 
ఎంతో ఊరట


నీ నోటి మాట
నా బాధలలో ఎంతో
ఓదార్పు నిచ్చు

నీ నోటి మాట
గాయం చేసినా నన్ను
మంచిగా మార్చు

నీ మాటలలో
నా హృదయ స్పందన
ప్రతిధ్వనించు


నీ మాటలలో
కానరాదు ఎన్నడు
ఏ పక్షపాతం

నీ నోటి మాట
ఎన్నడూ మారనిది
మార్పులేనిది

నీ నోటి మాట 
నిత్య కావాలి నాకు
వీనుల విందు  

* * *

1 comment:

అక్షర మోహనం said...

మీ హైకూలన్నీ
పచ్చని ఆకులపై
మెరిసిపోతూ..
మురిసిపోతూ..

Post a Comment