Wednesday, April 21, 2010

ఆవయవదానం X సమాధులు - కవ్వాలి కవిత

(గతంలో ఆవయవదానం X సమాధులు గూర్చిన రెండు తలంపుల మధ్య పుట్టుకువచ్చిన కవ్వాలి కవిత ఇది - ఇలాంటి కవ్వాలి కవితలుకూడా ఉన్నాయని ఇటివలే విన్నా - ఈచిరు ప్రయత్నం అంగీకరించి ఆస్వాదించగలరు - తగురీతి సూచించ గలరు)


దేహంతో దేవుణ్ణి ఘనపరచాలని మోక్షం చేరాలని
దైవభీతి పాపభీతి లేకుంటే మోక్షమే లేదుగా


బంధాలన్నీ తెంచుకున్న వారే నిజమైన సమాధి చేరినవారు
బంధాలు లేకున్నా ఆవయవదానంతో సమాధులుగా  మారిరివీరు

బ్రతికివుండగానే ఖర్చు చేస్తున్నారు  సమాధుల కోసం
బ్రతికివుండగానే ఖర్చై పోవాలనుకుంటున్నారు పరుల కోసం


తనవారినే శంకిస్తున్నారు బంధాలు తెంచుకుంటున్నారు
తనవారు కాకున్నా సాయపడి బంధాలు పెంచుకుంటున్నారు


ఎవరు చెప్పారో సమాధుల ద్వారా మోక్షం పొందగలమని
ఎవరూ చెప్పకున్నా ఎవరికైనా ఉపయోగపడాలనుకున్నారు


స్వంత సమాధి తోలుచుకోవటం ఈనాటిది కాదు ఏనాడో వచ్చింది
స్వంత ఆలోచన కాకున్నా ఈనాడు ఎవరూ అడ్డు చెప్పలేనిది


అది సంకుచితమైనదేమో ఆలోచించితివా
ఇది విశాలమైనదేమో యోచించితివా


స్వేచ్చా జీవి మానవా జీవితసారం ఎరుగవా
స్వేచ్ఛతోనే  నీలోని సంకల్పం సాధకమౌగా


మేలుకో మానవా అంతంలో కొంతైనా వదులుకోస్వార్ధం 
మసలుకో వికసిస్తూ తెలుసుకో కనీసం మతాలసారం

నీకు అభ్వంతరమేమీ లేదు సమాధి చేరాలనుకుంటే
నిన్ను అభ్వంతరపెట్టే దెవరు సమాధిగా మారాలనుకుంటే


స్వార్ధపరుడివైపోతున్నావేమో నిన్ను నీవే తెలుసుకో
నిస్వార్ధ పరుడవని నిన్ను గూర్చి ఇతరులే తేల్చాలి


అక్కడ దొరికేది  పూర్తిగా విశ్రాంతి గెలిచినా ఓడినా
ఇక్కడ ఉండేది అవిశ్రాంత పోరాటం గెలుపైనా ఓటమైనా


పోరాటం లేకుండా ఏ మానవుడైనా పొందగలడా మోక్షం
పిరికివారు మోక్షం చేరలేరని మతగ్రంధమిస్తుంది సాక్ష్యం 

                            * * * * *         
 

No comments:

Post a Comment