Saturday, November 27, 2010

పోమ్మనకుండా పొగపెట్టినట్టు

పొగ x అనుభవం అని టైటిల్ పెడదామనుకుని పోమ్మనకుండా పొగపెట్టినట్టు అని మార్చాను . 
మొదటిగా  సమయాభావం వల్ల నా బ్లాగును కొనసాగించలేక పోయినందుకు చింతిస్తూ ఇటీవలి నా అనుభవం నేడు(27-11- 2010 ) టీవీల ద్వారా ధూమపానం వల్ల జరుగుతున్న మరణాలు తెలుసుకొని పంచుకోదలచాను. ఈ ధూమపానం వల్ల వ్యసనపరులే కాక ఇతరుల మరణాలకు కూడా ఎలా కారణమవుతున్నారో తెలుసుకొని ఎంతో బాఢ పడ్డాను. బహుశా  ఈ విషయాన్ని గుర్తించేనేమో ప్రభుత్వం కూడా తమ కర్తవ్యంగా భావించి బహిరంగ ప్రదేశాలలో ప్రోగ  త్రాగారాదని నిషేధిస్తూ చట్టం కూడా చేసింది. కాని ఆచరణలో ఇది ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనందరికీ తెలిసిందే.
రెండు రోజుల క్రితం నేను విజయవాడలోని ఆటోనగర్ గేటు బస్టాప్ వద్ద నిలిచి వుండగా ఒక వ్యక్తి ధూమపానం వల్ల నా ముక్కుపుటాలు అదిరిపోయాయి. నాకు ఎంతో ఆక్రోశం కలిగి అతని చెంప పగులగోడదాం అనిపించింది. ఒకవేళ అతను తెలివిగా రెండో చెంప చూపిస్తాడేమో లేదా నా రెండు చెంపలు పగులకొడతాదేమో అని మౌనం వహించాను. దుష్టుడికి దూరంగా ఉండాలనే సామెత గుర్తుకు వచ్చి సహించాను.
 ఈ సందర్భంగా ఒక కవి వ్రాసిన సినిమా పాట గుర్తుకు వచ్చి దాన్ని ఈ విధంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు చేయవచ్చునేమో అనిపించింది. ఆ పాట -
"ఎన్ని చట్టాలు వచ్చినా చుట్టాలు చెప్పినా చేసేది ఏమిటో చేయరా బాబయా!"

నిజమే మరి చట్టాలు చేసినా కాని అవగాహన లేకనో లేక తమ ఇష్టాన్ని నెగ్గించుకునే పంతంతోనో ధూమపాన ప్రియులు తమకి, ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగించడం ఎంతో బాధాకరం. తమ వద్దనుండి  పొమ్మని పొగపెడితే అభ్యంతరం ఉండకపోవచ్చునేమో కాని ఆపోగే  లోకంలోనుంచి  పంపడానికైతే  సహించ గలమా!  తమకు దేశం ఏమి చేసిందో తాము దేశానికి కాక పోయినా  ఇతరుల కేమి ఏమి చేస్తున్నామో ఈ ప్రియులు గ్రహిస్తే ఎంత మేలు. ఇదే (ఇటీవలి కాలం నుండీ ఆరోగ్యం పట్ల శ్రద్దః వహించే) నా పొగ x(perience) అనుభవం. - మీ ప్రకాష్.

1 comment:

అక్షర మోహనం said...

ప్రక్కవానికి హాని అని తెలిసికూడా పొగ తాగే 'పొగ ' రుబోతులున్నారు. పొగ మీద పగబట్టి ఇంకా గట్టి చట్టాలు తెస్తె బావుణ్ణు.

Post a Comment